కార్మికుల బహిష్కరణ ఖర్చుల గూర్చి మంగళవారం ఓటు వేయనున్న ఎంపీలు

- July 02, 2017 , by Maagulf
కార్మికుల బహిష్కరణ ఖర్చుల గూర్చి మంగళవారం ఓటు వేయనున్న ఎంపీలు

మనామా: పని అనుమతులకు విరుద్ధంగా తమ యజమానుల నుండి పారిపోయిన ప్రవాస కార్మికులను   దేశం నుండి పంపించే సమయానికి వారి పారితోషకం తదితర ఖర్చులను వారిని నియమించిన ఉద్యోగ సంస్థలే చెల్లించేలా అనుమతిని కోరుతూ ప్రతినిధుల సభలో ఒక కమిటీ సిఫారసు చేసింది. సేవల కమిటీ సైతం ఇటీవలే ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రవాస కార్మికుల బహిష్కరణ సమయంలో పారితోషికాలు, ఇతర చెల్లింపులు యజమానులు చెల్లించకుండా అన్ని ఖర్చులను వలస కార్మికులు , వారిని నియమించిన ఉద్యోగ నియామక సంస్థలే  చెల్లించే విధంగా అనుమతిని కోరనున్నారు. కమిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం, "ఈ ప్రతిపాదన ప్రకారం,వలస కార్మికులకు ఉపాధిని కల్పించిన యజమానిని  మరియు వారికి చెందిన వ్యాపారాలను కాపాడటంతో పాటు, సక్రమ రీతిలో పని చేయని వలస కార్మికులను నియమించిన ఆయా ఉద్యోగ సంస్థలపై చర్యలను తీసుకొనేందుకు దోహదపడనుంది. ఎంపీలు అబ్దుల్రహ్మాన్ బుంజిద్, ఖలీద్ అల్ షెర్, ప్రతిపాదన "కార్మిక పరిస్థితులకు సంబంధించిన ఈ నిబంధనలు పని అనుమతి చట్టాలకు అనుగుణంగాఉన్నాయని మానవ హక్కుల సూత్రాలకు విరుద్ధంగా లేదు" అని పేర్కొన్నారు.లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ ఈ ప్రతిపాదనకు ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ దీనికి మద్దతు ఇచ్చాయి ఈ మంగళవారం ప్రతిపాదనపై సమీక్షించి ఎంపీలు  ఓటు వేయాల్సిఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com