యూఏఈ లో చిక్కుకున్న భారతీయులు
- July 02, 2017
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న 22 నౌకల్లో దాదాపు 100 మంది భారతీయ నావికులు చిక్కుకున్నట్లు దుబాయ్‌లోని భారతీయ దౌత్య కార్యాలయ అధికారి విపుల్ వెల్లడించారు. నౌకల్లో చిక్కుకుపోయిన నావికులు తమకు ఫోన్ చేసి రక్షించాల్సిందిగా కోరినట్లు విపుల్ తెలిపారు. '22 నౌకల్లో దాదాపు 97 మంది నావికులు చిక్కుకున్నట్లు మాకు సమాచారం వచ్చింది. ఇతర దేశాలకు సంబంధించి ఎంత మంది ఉన్నారనే సమాచారం మాత్రం మా దగ్గర లేదు. శ్రీలంక, ఫిలిప్పీన్స్, మయన్మార్, పాకిస్థాన్‌కు చెందిన నావికులు' కూడా ఈ నౌకల్లో ఉన్నట్లు సమాచారం.
నౌకల్లో పని చేసేందుకు వెళ్లిన తమకు గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఆహారం, తాగేందుకు మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నావికులు తమకు ఫిర్యాదు చేసినట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఎక్కువ మంది జీతాలు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు చేస్తున్నారు, యజమానుల దగ్గర నుంచి జీతాలు ఇప్పిస్తే తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోతామని నావికులు చెప్పినట్లు గల్ఫ్‌న్యూస్ తెలిపింది. నావికులను తీసుకెళ్లిన యజమానులు, ఏజెంట్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని, వేరే నౌకల ద్వారా ఆహారం, మంచి నీళ్లు పంపించినట్లు దౌత్యాధికారి పేర్కొన్నారు.
పని చేయించేందుకు తీసుకెళ్లి జీతాలు ఇవ్వకుండా, తిండి పెట్టకుండా ప్రవర్తిస్తున్న కంపెనీ యజమానులు, ఏజెంట్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికుడు గిరిష్ పంత్ డిమాండ్ చేశారు. కొన్ని నౌకల్లో ఇంధనం అయిపోవడంతో జనరేటర్లు కూడా తిరగడం లేదు, దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని గిరిష్ చెప్పాడు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







