కాతిఫ్‌ తీవ్రవాద ఘటనలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

- July 05, 2017 , by Maagulf
కాతిఫ్‌ తీవ్రవాద ఘటనలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు తీవ్రవాద దాడి ఘటనలో. ఇంటీరియర్‌ మినిస్ట్రీ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మేజర్‌ జనరల్‌ మన్సౌర్‌ అల్‌ టుర్కి మాట్లాడుతూ, అల్‌ ముసావారా డిస్ట్రిక్ట్‌లో సెక్యూరిటీ పెట్రోల్‌ వెళుతుండగా, పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వైస్‌ సర్జంట్‌ అదెల్‌ ఫలెహ్‌ అల్‌ ఒతైబి చనిపోగా, ముగ్గురు సెక్యూరిటీ మెన్‌ గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో వృధాగా పడి ఉన్న ఇళ్ళలో తీవ్రవాదులు తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నారు. గత నెలలో ఇదే ప్రాంంలో ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ప్రాణాలు కోల్పోయారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com