'ఏజెంట్ భైరవ' మెప్పించే కమర్షియల్ సినిమా..!
- July 05, 2017
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై విజయ్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏజెంట్ భైరవ'. భరతన్ దర్శకుడు. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మాత. ఈ సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో సినిమా గురించిన సంగతులను తెలియజేశారు.
నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ - ''విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'ఏజెంట్ భైరవ' సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఆన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉంటుంది. ఇందులో హీరో విజయ్ ఓ బ్యాంక్‌లో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఓ పెళ్ళిలో హీరోయిన్ కీర్తి సురేష్‌ని చూసి ప్రేమలో పడతాడు. కానీ కీర్తి సురేష్ ఓ ప్రమాదంలో ఉందని తెలుసుకున్న హీరో ఆమెకు అండగా నిలబడ్డాడనేదే కథ. ఈ సినిమాలో జగపతిబాబుగారు పిడకల కోటయ్య అనే క్యారెక్టర్‌లో కనపడతాడు. మాంసం అమ్ముకునే పిడకల కోటయ్య ఉన్నట్లుండి పెద్ద బిజినెస్‌మేన్‌గా ఎలా మారాడు. కాలేజీలను ఎలా స్థాపించాడు. దాని వల్ల హీరోయిన్‌కు వచ్చే సమస్య ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సమాజంలో ప్రతి విషయానికి ఓ క్వాలిఫికేషన్ ఉంది. కానీ ప్రైవేటు కాలేజీలు నడిపే పెద్ద మనుషులకు క్వాలిఫికేషన్ ఎందుకు లేదనే పాయింట్‌తో సినిమా నడుస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఈ సినిమాను తమిళంలో విజయ బ్యానర్‌వారు నిర్మించారు. వారు తెలుగు ప్రేక్షకులు, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే డైలాగ్స్, సీన్స్ డిజైన్ చేయడం వల్ల సినిమా మన తెలుగువారికి కూడా బాగా నచ్చుతుంది. నేను దర్శకుడిగా చింతపల్లి రమణగారి రచనలో ఓ సినిమా చేయబోతున్నాను. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ. కథకు తగ్గట్లు మంచి లీడింగ్ హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తుంది. అలాగే నా బ్యానర్‌లో బెలూన్, స్వామి2 సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాను. నా డ్రీమ్ ప్రాజెక్ట్ 'యదాతథం' కోసం నేను దర్శకుడిగా మారాను. అందులో భాగంగానే 'దృశ్యకావ్యం' సినిమా చేశాను. కానీ ఆ సినిమా సమయంలోనే హీరోయిన్‌కు పెళ్ళి కావడం, ఆ హీరోయిన్ భర్త సినిమాలు చేయడానికి అంగీకరించకపోవడంతో దృశ్యకావ్యం2 సినిమా చేయలేకపోయాం. ఇక బెలూన్ సినిమాలో రాజ్‌తరుణ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక మా ఏజెంట్ భైరవ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను ఇప్పటికి 235 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ఇంకా థియేటర్స్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి'' అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







