ట్రక్ ప్రమాదంలో గుర్రపు బండి ధ్వంసం
- July 05, 2017
అసలే...అవి చల్ ..చల్ చలాకీ గుర్రాలు ....జట్కా తో సహా వాటిని ట్రక్కు లోపలకు ఎక్కించారు... కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ గుర్రాలకు ఉషారు వచ్చింది.. ట్రక్కు లోపల పరుగులు పెట్టేందుకు బలంగా ప్రయత్నించాయి...దీంతో ఒక్కసారిగా ట్రక్కు ఒడిదుడుకులకు లోనయ్యింది. ఈ ఆకస్మిక పరిణామానికి ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. నడి రోడ్డుపై ట్రక్కు బోల్తాపడింది..గుర్రపు బండి నుజ్జు నుజ్జు కాబడింది. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 5:15 గంటలకు సల్మాబాద్ నుంచి మనామకు వెళ్లే దారిలో సీఫ్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. " ఈ ట్రక్కు లోపల రెండు గుర్రాలు ఉన్నాయి..అవి గుర్రపు బండికి జత చేయబడి ఉన్నాయి. ట్రక్కు లోపల గడిబిడి చేసిన గుర్రాల కారణంగా ట్రక్కుఅదుపు కోల్పోయి బోల్తా కొట్టిందని..ఆ ఘటనలో గుర్రపు బండి పాడైందని " ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







