సినిమా ప్రియులకు షాక్ ఇవ్వనున్న ఏపీ.. టికెట్స్ ధర పెంపు
- July 06, 2017
వినోదం కోసం సినిమాలకు వెళ్దాం అంటే టికెట్ ధరలు షాక్ కొట్టేటట్లు వున్నాయి.. ఇప్పటికే తమిళనాడు లో థియేటర్లు టికెట్ ధరను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని సమ్మె చేస్తున్న సంగతి విధితమే.. కాగా తాజాగా ఏపీలోని సినిమా టికెట్స్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మల్టీ ప్లెక్స్ లో రిక్లయినర్ సీట్లకు రూ.300, మిగిలిన టికెట్స్ ధర రూ.200 గా ఉండనున్నాయి.. మిగిలిన థియేటర్ల టికెట్ ధర టికెట్ ధర, జీఎస్టీ పన్ను కలిపితే.. రూ.118 అవుతుంది.. ఈ మేరకు గత కొద్ది రోజుల క్రితమే ఆర్ధక, హోమ్, రెవెన్యూ శాఖల అధికారులతో తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్రతినిధులు సమావేశమయ్యారు. టిక్కెట్ ధరల పెంపుపై చర్చించారు. ఈ క్రమంలో త్వరలోనే టికెట్ల ధరల పెంపునకు సంబందించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో రిలాక్స్ కోసం సినిమానే సాధనంగా చేసుకొన్న సామాన్యుడు టికెట్ పెంపుతో వినోదం కూడా భారంగా మారింది.. అని చెప్పవచ్చు..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







