3-1 తేడాతో విండీస్‌తో వన్డే సిరీస్ భారత్ కైవసం
- July 06, 2017
కరీబియన్ గడ్డపై టీమ్‌ఇండియా అదరహో అనిపించింది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో సమష్టిగా సత్తాచాటి తమకు తిరుగులేదని నిరూపించింది. నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన హోల్డర్ సేన చివరిదైన ఐదో వన్డేలో పోరాట పటిమ ప్రదర్శించలేకపోయింది. గత మ్యాచ్‌లో లాగే ఛేదనలో భారత్‌ను కట్టడి చేసి సిరీస్‌ను సమం చేయాలనుకున్న విండీస్ ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అజేయ శతకం ముందు తేలిపోయింది. కింగ్‌స్టన్‌లో జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో 3-1 తేడాతో సిరీస్‌ను కోహ్లీసేన సొంతం చేసుకుంది. ఐదో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్.. మహ్మద్ షమీ... ఉమేశ్ యాదవ్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. అనంతరం స్టార్ క్రికెటర్ విరాట్ శతకం, దినేశ్ కార్తిక్ అర్ధశతకంతో రాణించడంతో భారత్ 36.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







