గోల్డ్ బాండ్స్ కొత్త ఇష్యూ జూలై 10న
- July 06, 2017
సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) స్కీము కింద ప్రభుత్వం జూలై 10న మలివిడత గోల్డ్ బాండ్ల ఇష్యూను ప్రారంభించనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి గోల్డ్ బాండ్ల ఇష్యూ. ఈ ఇష్యూకు దరఖాస్తులు జూలై10–14 తేదీల మధ్య స్వీకరిస్తామని, బాండ్లను జూలై 28న జారీచేస్తామని గురువారం విడుదలైన ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది.
ఒక గ్రాము బంగారానికి సమానంగా ఒక బాండు జారీఅవుతుంది. ఈ బాండ్లలో కనీస పెట్టుబడి ఒక గ్రాముకాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాములకు సమానమైన బాండ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. 8 సంవత్సరాల కాలపరిమితితో జారీచేసే ఈ బాండ్లపై 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.2015 నవంబర్‌లో ఈ స్కీమును ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ 8 దఫాలు పుత్తడి బాండ్లను జారీచేసి, రూ. 5,400 కోట్లు సమీకరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







