మెక్సికోలో ఖైదీల ఘర్షణ..
- July 07, 2017
మెక్సికో: మెక్సికోలోని ఓ జైలులో చెలరేగిన హింసలో 28 మంది హత్యకు గురి కాగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుయెర్రెరో రాష్ట్రం లాస్‌క్రూసెస్ ఫెడరల్ జైలులో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఖైదీల మధ్య గ్రూపు గొడవలున్నాయని ఈ నేపథ్యంలోనే హత్యాకాండ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు కిచెన్, సెక్యూరిటి వింగ్, విజిటింగ్ ఏరియాలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రత్యర్థి వర్గం వారిని తీవ్రంగా కొట్టి చంపారని, కొందరి గొంతులు కోసి ఉండగా, మరికొందరి శరీరాలపై బుల్లెట్ గాయాలున్నాయని భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
కాగా, తమ వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఖైదీల బంధువులు జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మెక్సికోలోని జైళ్లలో చాలా వరకూ ఖైదీల ఆధిపత్యమే నడుస్తుంటుంది. ఇక్కడి కారాగారాల్లోకి ఆయుధాలు, మద్యం, మాదకద్రవ్యాల రవాణా యథేచ్ఛగా జరుగుతుంటుంది. దీంతో ఆధిపత్యం కోసం ఖైదీల ముఠాలు తరచూ గొడవలకు దిగుతుంటాయి. 2016లో టోపోచికో జైలులో ఖైదీల మధ్య జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసులతో పాటు సైన్యాన్ని రంగంలోకి దించింది. జైలుపై రెండు హెలికాప్టర్లు ఎల్లప్పుడూ పహారాకు ఉండేలా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









