ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు కుటుంబసభ్యుల ఘన నివాళి
- July 07, 2017
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి వేడుకలు శనివారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానేత జయంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనీల్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం వైఎస్ఆర్ ఘాట్ ప్రాంగణంలోని మహానేత విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమానికి మహానేత కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు మహానేత 68వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







