'స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును సొంతం చేసుకున్న పీవీ సింధు

- July 07, 2017 , by Maagulf
'స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును సొంతం చేసుకున్న పీవీ సింధు

రియో పతక విజేత పీవీ సింధు 'స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును అందుకుంది. గురువారం రాత్రి ముంబయిలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో పుల్లెల గోపీచంద్‌కు 'కోచ్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును, మిల్కాసింగ్‌కు లివింగ్‌ లెజెండ్‌ అవార్డు , అభినవ్‌ బింద్రాకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రదానం చేశారు. కాగా, శిష్యురా లు సింధు చేతుల మీదుగా గోపీ అవార్డును అందుకోవడం విశేషం. పారా అథ్లెట్లు దేవేంద్ర జఝారియా, మరియప్పన్‌ తంగవేలు, వరుణ్‌ భారతి, దీపా మాలిక్‌ కూడా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి షట్లర్‌ గుత్తా జ్వాల, క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com