దుబాయ్‌ వాటర్‌ ఫ్రంట్‌ మార్కెట్‌ని సందర్శించిన మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌

- July 08, 2017 , by Maagulf
దుబాయ్‌ వాటర్‌ ఫ్రంట్‌ మార్కెట్‌ని సందర్శించిన మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌

యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, హమ్రియా పోర్ట్‌లోని వాటర్‌ ఫ్రంట్‌ మార్కెట్‌ని సందర్శించారు. దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌మక్తౌమ్‌, షేక్‌ మొహమ్మద్‌ వెంట ఉన్నారు. వినియోగదారులకు అలాగే చేపల అమ్మకందార్లకు అక్కడ లభిస్తోన్న సౌకర్యాల గురించి అక్కడివారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు షేక్‌ మొహమ్మద్‌. ఫిషింగ్‌ బోట్స్‌, వాటర్‌ ట్యాక్సీలను డాక్‌ చేసే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు వైస్‌ ప్రెసిడెంట్‌. వాటర్‌ ఫ్రంట్‌ మార్కెట్‌ నిర్వహణ పట్ల షేక్‌ మొహమ్మద్‌ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అక్కడి నిర్వాహకులకు కొన్ని సూచనలు కూడా చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com