అల్ అయిన్‌లో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి
- July 08, 2017
ఆసియాకి చెందిన కార్మికుడొకరు అల్ అయిన్ సిటీలో, పిడుగుపాటు కారణంగా మృతి చెందాడు. పనిచేస్తున్న ప్రాంతంలో పిడుగు పడి కార్మికుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో పెద్దయెత్తున శబ్దాలు విన్పించాయనీ, చిన్నపాటి అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుందని అబుదాబీ సివిల్ డిఫెన్స్ డైక్టర్ జనరల్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ జలీల్ అల్ అన్సారీ చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతానికి తక్షణం రెస్క్యూ టీమ్ వెళ్ళినా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడు. పిడుగుపాటు కారణంగా ఆ ప్రాంతంలో కొంత ఆస్తి నష్టం కూడా సంభవించిందని అబుదాబీ సివిల్ డిఫెన్స్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







