సేఫ్‌ సమ్మర్‌పై మినిస్ట్రీ అవేర్‌నెస్‌ సెమినార్‌

- July 08, 2017 , by Maagulf
సేఫ్‌ సమ్మర్‌పై మినిస్ట్రీ అవేర్‌నెస్‌ సెమినార్‌

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌, సేఫ్‌ సమ్మర్‌పై అవేర్‌నెస్‌ పేరుతో ఓ సెమినార్‌ని నిర్వహిస్తోంది. ఇండియా, పాకిస్తాన్‌, నేపాల్‌, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, బహ్రెయిన్‌ తదితర దేశాల ఎంబసీలతో కలిసి ఈ సెమినార్‌కి రూపకల్పన చేశారు. బహ్రెయిన్‌ కేరళీయ సమాజంలో ఈ సెమినార్‌ని ఏర్పాటు చేశారు. సమ్మర్‌ సందర్భంగా రిస్క్‌ని తగ్గించేందుకు తద్వారా కార్మికులకు సమ్మర్‌ నుంచి ఉపశమనం కల్పించేందుకు చేపట్టాల్ని చర్యల గురించి ఈ సెమినార్‌లో పలువురు వక్తలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడంతోపాటుగా, కొన్ని సూచనలు కూడా చేశారు. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ సీనియర్‌ ఆక్యుపేషనల్‌ సేఫ్టీ ఇంజనీర్‌ హుస్సేన్‌ అల్‌ హుస్సేనీ మాట్లాడుతూ, కింగ్‌డమ్‌లో సమ్మర్‌ సందర్భంగా కార్మికుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఆదేశాలిచ్చిన మేరకు వర్క్‌ బ్యాన్‌ని ఖచ్చితంగా అమలు చేయాలనీ, ఆయా సంస్థలపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com