విలన్ గా కెరీర్ ఎంజాయ్ చేస్తున్న అరవింద్ స్వామి
- October 17, 2015
తనీ ఒరువన్ సినిమాతో విలన్ గా మెప్పించిన అరవింద్ స్వామి ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి, ప్రస్తుతం విలన్ గా కెరీర్ ఎంజాయ్ చేస్తున్న అరవింద్ స్వామి మరోసారి సోలో లీడ్ గా కనిపించనున్నాడు. కోలీవుడ్ లో రియలిస్టిక్ దర్శకుడిగా పేరున్న బాల దర్శకత్వంలో అరవింద్ స్వామి ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం శశికుమార్, వరలక్ష్మీల కాంబినేషన్ లో 'తారై తప్పట్టై' సినిమా చేస్తున్న బాల, ఈ సినిమా పూర్తయిన తరువాత అరవింద్ స్వామి లీడ్ రోల్ లో సినిమా కోసం వర్క్ చేయనున్నాడు. సాఫ్ట్ గా స్టైలిష్ లుక్ లో కనిపించే అరవింద్ స్వామి, బాల లాంటి దర్శకుడితో కలిసి పనిచేయగలడా అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా అరవింద్ స్వామి, బాలల కాంబినేషన్ లో సినిమా దాదాపుగా కన్ఫామ్ అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







