'స్పైస్ జెట్' వారి సరి కొత్త ఆఫర్
- October 17, 2015
స్పైస్ జెట్ విమానాయాన సంస్థ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సరికొత్త సర్వీసును ప్రారంభించనుంది. తన నెట్ వర్క్ పరిధిలో నవంబర్ 2 నుంచి రెడ్ ఐ ఫ్లయిట్ సర్వీసెస్ ను మొదలుపెట్టనుంది. దీనిద్వారా ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-నాందెడ్ కు నడిచే మిడ్ నైట్ విమానాల టికెట్ ధరలు తగ్గనున్నాయి. సాధారణంగా రెడ్ ఐ విమానాలు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణమై.. తెల్లవారుజాముకు గమ్యస్థానాన్ని చేరుతాయి. ఇప్పటికే రెండు దేశీయ విమానాయాన సంస్థలు ఇలాంటి ఆఫర్లను ప్రయాణికులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. జెట్ ఎయిర్ వేస్, ఇండిగో సంస్థలు చౌక ధరలకు అర్ధరాత్రి నడిచే విమానాల సర్వీసులను అందజేస్తున్నాయి. గుర్గావ్ కు చెందిన స్పైస్ జెట్ కూడా ఇదేదారిలో ముందుకుసాగుతున్నది. తన శీతకాలం షెడ్యూల్ భాగంగా ఇలాంటివే మరో ఆరు సర్వీసులను ప్రారంభించాలని ఆ సంస్థ భావిస్తున్నది. రెడ్ ఐ సర్వీసులో భాగంగా ఢిల్లీ-బెంగళూరు మధ్య టికెట్ ధరను రూ. 3889గా స్పైస్ జెట్ నిర్ణయించింది. రెడ్-ఐ విమాన సర్వీసులు భారత్ లో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నా.. అమెరికా, యూరప్ దేశాల్లో అవి ఎంతగానో ప్రజాదరణ పొందాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







