భారతదేశ వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు
- July 09, 2017
ఇక గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సాయి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు సాయి ఆలయాలకు పోటెత్తారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఢిల్లీలో గురుపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురుపూజోత్సవం సందర్భంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయాల ముందు క్యూ కట్టారు.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో గురుపూర్ణిమ సందర్భంగా పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సాయి ఆలయాలు సహా గురుదత్త పీఠం ఉన్న గుడుల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
కృష్ణ జిల్లా గూడూరులో శ్రీ రామ్ రతన్ జి మహారాజ్ మరియు రాజా మాత గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







