జర్మనీలో ప్రకాశం జిల్లా యువకుడు మల్లికార్జునరావు మృతి
- July 09, 2017
జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ పరిధిలోని కట్టవారిపాలెం గ్రామానికి చెందిన కట్టా రమణయ్య(రేషన్ డీలర్) కుమారుడు మల్లికార్జునరావు(22) 55 రోజుల క్రితం ఉద్యోగం నిమిత్తం జర్మనీ వెళ్లాడు. అక్కడ ఈఎస్ఎస్ఎన్ నగరంలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం విహార యాత్ర నిమిత్తం ఆరుగురు యువకులతో కలిసి ఓ నదిలో పడవ ప్రయాణానికి వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వీరు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మల్లికార్జునరావుతో పాటు మరో యువకుడు మృతి చెందినట్లు సమాచారం. మల్లికార్జునరావు మృతి చెందినట్లు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అతడి తల్లిదండ్రులకు చరవాణి ద్వారా సమాచారం అందింది. చేతికి అందివచ్చిన కుమారుడు అకాల మృతితో తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







