ఒంటరి ఉద్యోగస్తులతో కతార్ లోని లాండ్రీలకు లాభాల పంట
- October 17, 2015
దేశంలోకి ప్రవహిస్తున్న ఉద్యోగస్తులతో లాండ్రీ సేవలు నిదానంగా ఐనా స్థిరంగా పెరుగుతున్నాయి. ఈ డిమాండు ప్రవాస కుటుంబాలు మరియు ఒంటరి ఉద్యోగస్తులుండే ప్రాంతాల్లో ఎక్కువగా కనిపి స్తోంది. ఇందుకు ఒంటరి ఉద్యోగస్తులు ఉమ్మడిగా నివసించే ప్రదేశాల్లోఅందరూ బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి తగిన ప్రదేశం లేకపోవడం, వారి పనివేళలు ఇందుకు అనుకూలంగా లేకపోవడం, వారాంతాలలో వారు సహోద్యోగులు, స్నేహితులతో కలసి బయటకు వెళ్ళి ఆనందించడానికి మక్కువ చూపడం, కొంతమంది దగ్గర వాషింగ్ మెషిన్లు ఉన్నప్పటికీ, ఆరవేసు కోవడని తగిన స్థలం లేకపోవడం, స్థనిక ప్రజల అభ్యంతరాలు ఇస్త్రీ చేయడం కష్టమైన, ఎక్కువ సమయం తీసుకొనే పనిగా వారు భావించడం వంటి కారణాలు లాండ్రీ సర్వీసులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తమ ఖాతాదారుల సంఖ్యలో 70 శాతం ఒంటరి ఉద్యోగస్టులైనప్పటికీ, తమ ఆదాయంలో సింహభాగం తమ రెగ్యులర్ ఖాతాదారులైన స్థానికుల నుండే వస్తుందని అల్ వక్రా లో కొత్తగా శాఖను ప్రారంభించిన ఒక వ్యాపారస్తుడు తెలియజేసాడు. ఐతే పోటీ పెరిగిన కారణంగా వారు పాత రేట్లకే సర్వీసులను అందిస్తున్నామని, గత పది సంవత్సరాలుగా తాము రేట్లను పెంచనే లేదని దోహాలోని ఒక లాండ్రీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సత్ నారాయణ్ తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









