'GTWCA' వారి ఆధ్వర్యంలో వెల్లువిరిసిన బతుకమ్మ మరియు దసరా సంబరాలు
- October 17, 2015


తెలంగాణా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని దుబాయ్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఇబ్రహీం అహ్మద్ అన్నారు. దుబాయ్‌లోని న్యూ వరల్డ్ ప్రైవేట్ స్కూల్‌లో జరిగిన గల్ఫ్ తెలంగాణా బతుకమ్మ సంబరాల్లో ఇబ్రహీం ముఖ్య అధితిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు తెలంగాణా ప్రభుత్వం తరఫున సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ హాజరయ్యారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసేందుకు గల్ఫ్ తెలంగాణా చేసిన కృషి అభినందనీయమని సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ ప్రశంసించారు. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ప్రవాస తెలంగాణావాసులు... తెలంగాణా రాష్ర్టం ఏర్పడ్డ తర్వాత మరింత ఉత్సాహంగా జరుపుకుంటున్నారన్నారు . దుబాయ్‌లో జరిగిన బతుకమ్మ వేడుకలకు కోసం గల్స్ తెలంగాణా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బతుకమ్మల తయారీకి ఉపయోగించేపూలను తెలంగాణా నుండి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో 12 మంది కళాకారుల బృందాన్ని దుబాయ్ పంపించింది తెలంగాణా సర్కార్.
గతంలోనూ వివిద దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించినా... ఈ సారి తెలంగాణా సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుచేశేలా కనివినీ ఎరుగని రీతిలో ఉత్సవాలను జరుపుకుంటున్నారు ప్రవాస తెలంగాణావాసులు. దుబాయ్‌లోని న్యూ వరల్డ్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన వేడుకలైతే తెలంగాణా పల్లెను తలపించాయి. రంగురంగు పూల బతుకమ్మలతో దుబాయ్ తెలంగాణా మహిళలు, చిన్నారులు సందడి చేశారు. వారితో కలిసి టిఆర్ ఎస్ మహిళా అధ్యక్షురాలు, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ఆడిపాడారు. తెలంగాణా సాంస్కృతిక సారథి రసమయి ఆధ్వర్యంలో ధూందాంతో దుబాయ్ స్కూల్ ప్రాంగణం హోరెత్తింది. తెలంగాణా సంస్కృతి సాంప్రదాయాలను తలపించేలా మహిళలు, చిన్నారులు వస్ర్తధారణతో తరలివచ్చారు. పోతురాజుల విన్యాసాలు, బోనాలతో తెలంగాణా పల్లె వాతావరణాన్ని దుబాయ్‌లో కళ్లకు కట్టారు. ఇక రసమయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధూంధాంతో దుబాయ్‌లోని తెలంగాణావాసులు ఉర్రూతలూగారు. టూరిజం డైరెక్టర్ ఇబ్రహీం అధితిగా హాజరై...ఉత్సవాలను ఆద్యంతం తిలకించారు. దుబాయ్‌లోని తెలంగాణా వాసులకు తమ పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణా ఏర్పడ్డ తర్వాత దుబాయ్‌లో అధికారిక హోదాలో బతుకమ్మ వేడుకలకు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్. దుబాయ్‌ని తెలంగాణా పల్లెగా మార్చిన గల్ఫ్ తెలంగాణా సంఘాన్ని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన 'GTWCA' వారికి మాగల్ఫ్.కామ్ తరుపున ప్రత్యేక అభినందనలు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







