దుబాయ్ ఎయిర్‌పోర్ట్ హ్యాండెలర్‌పై దొంగతనం అభియోగం
- July 11, 2017
విమానంలోకి లగేజ్‌ని తీసుకెళుతున్న సమయంలో బ్యాగేజీల్లోంచి విలువైన వస్తువుల్ని అపహరిస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ వర్కర్‌పై అభియోగాలు నమోదయ్యాయి. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో సోమవారం ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. 21 ఏళ్ళ నేపాలీ వ్యక్తి, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్‌ని విమానాల్లోకి తరలించే కంపెనీ తరఫున పనిచేస్తున్నాడు. ఈ వ్యక్తి లగేజ్ నుంచి విలువైన వస్తువుల్ని దొంగిలిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని సన్నిహితుడికి దొంగిలించిన వస్తువుల్ని అప్పగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గోల్డ్ యాంక్లెట్, యెల్లో అండ్ బ్లాక్ గ్లోవ్స్, రేబాన్ సన్ గ్లాసెస్, 10 ఈజిపిస్టయన్ పౌండ్స్, 100 రష్యన్ రూబుల్స్ నిందితుడి దగ్గర పోలీసులు కనుగొన్నారు. వివిద రకాలైన లగేజ్ బ్యాగేజ్ నుంచి వాటిని తస్కరించినట్లుగా నిందితుడు విచారణలో అంగీకరించాడు. మూడు వాచ్‌లు, హెడ్‌ఫోన్స్, ఒక సెల్‌ఫోన్, ఓ ఇయర్ రింగ్, ఓ ఫోన్ ఛార్జర్‌ని దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకోగా, వాటిని అల్ కోజ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అతని నివాసం నుంచి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







