రిసెప్షనిస్ట్‌పై దాడి: ఆరు నెలల జైలు
- July 11, 2017
హై క్రిమినల్ అపీల్ కోర్టు, ఓ బహ్రెయినీ మహిళకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఓ అపార్ట్మెంట్ బిల్డింగ్‌లోని రిసెప్షనిస్ట్‌పై దాడి కేసులో నిందితురాలి నేర నిరూపణ జరిగింది. పది రోజుల క్రితం మర్చిపోయిన డైరీని తెచ్చుకునే క్రమంలో నిందితురాలు, అక్కడి రిసెప్షనిస్ట్‌పై దురుగా ప్రవర్తించింది. తన డైరీలోని ఫొటోల్ని చూశారంటూ రిసెప్షనిస్ట్‌పై నిందితురాలు దాడి చేసినట్లు విచారణలో తేలింది. ఓ వ్యక్తితో కలిసి అపార్ట్మెంట్లో పనిచేస్తున్న రిసెప్షనిస్ట్లపై నిందితురాలు దాడి చేసినట్లుగా పోలీసులు వివరించారు. దాడి నేపథ్యంలో రిసెప్షనిస్టులు, నిందితురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండేందుకోసం తాను డబ్బు చెల్లించాననీ, డైరీ అక్కడ మర్చిపోయిన తాను బిల్లుని పూర్తిగా సెటిల్ చేయలేదని విచారణలో నిందితురాలు అంగీకరించింది. డైరీ కన్పించకపోవడంతోనే తాను వారిపై దాడిచేసినట్లు నిందితురాలు తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









