స్ట్రే డాగ్స్‌ కోసం హాట్‌లైన్‌

- July 11, 2017 , by Maagulf
స్ట్రే డాగ్స్‌ కోసం హాట్‌లైన్‌

స్ట్రే డాగ్‌ సమస్యల నేపథ్యంలో హాట్‌లైన్‌ని ప్రారంభించినట్లు వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ మినిస్ట్రీ పేర్కొంది. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2.15 నిమిషాల లోపు స్ట్రే డాగ్స్‌కి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా 34325639 నెంబర్‌ని చేయవచ్చునని అధికారులు తెలిపారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది. రెసిడెన్షియల్‌ ఏరియాస్‌లో స్ట్రే డాగ్స్‌ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వివరించారు. నార్తరన్‌, క్యాపిటల్‌ మరియు ముహర్రాక్‌ గవర్నరేట్‌ పరిధిలో స్ట్రే డాగ్స్‌ ఇబ్బందికరంగా మారాయి. స్థానికుల్ని, పెంపుడు జంతువల్ని స్ట్రే డాగ్స్‌ గాయపరుస్తున్నాయి. వందలాది ఫిర్యాదులు స్ట్రే డాగ్స్‌పై ఇప్పటికే నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com