సిమ్‌కార్డ్‌ కావాలా? ఐడీ, ఫింగర్‌ప్రింట్‌ తప్పనిసరి

- July 13, 2017 , by Maagulf
సిమ్‌కార్డ్‌ కావాలా? ఐడీ, ఫింగర్‌ప్రింట్‌ తప్పనిసరి

వ్యక్తులు, వాణిజ్య అలాగే ప్రభుత్వ సంస్థలు కొత్త మొబైల్‌ సర్వీసులు కావాలనుకుంటే ఐడీ కార్డుతోపాటుగా ఫింగర్‌ప్రింట్‌ స్కాన్‌ని తప్పనిసరి చేసింది బహ్రెయిన్‌ టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌ఎ). బటెల్కో ఈ విషయాన్ని వెల్లడించింది. నేటినుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఫింగర్‌ ప్రింట్‌ స్కాన్‌లు, ఐజిఎ (ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ఇ-గవర్నమెంట్‌ అథారిటీ) వెరిఫై చేస్తుంది. ఒక ఐడీ ద్వారా పొందగలిగే ప్రీపెయిడ్‌ మొబైల్స్‌ సంఖ్యని కూడా కుదించింది. ప్రీపెయిడ్‌ లేదా పోస్ట్‌పెయిడ్‌కి సంబంధించి సిమ్‌కార్డ్‌ ఎనేబుల్డ్‌ డివైజెస్‌కి ఈ కొత్త రూల్‌ వర్తిస్తుంది. బహ్రెయిన్‌లోని అన్ని మొబైల్‌ ఆపరేటర్స్‌ ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com