సిమ్‌ వాలిడిటీ పీరియడ్‌ తగ్గింపుతో టిఆర్‌ఎకి సంబంధం లేదు

- July 13, 2017 , by Maagulf
సిమ్‌ వాలిడిటీ పీరియడ్‌ తగ్గింపుతో టిఆర్‌ఎకి సంబంధం లేదు

టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ, కింగ్‌డమ్‌లో టెలిఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ తీసుకున్న నిర్ణయాలతో తమకు సంబంధం లేదని తెలిపింది. గరిష్టంగా 100 రోజులకు మాత్రమే వీలయ్యేలా ప్రీపెయిడ్‌ లైన్‌ కొనుగోలుపై మూడు ప్రముఖ టెలికామ్‌ ప్రొవైడర్స్‌ నిర్ణయాల్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు ఈ గరిష్ట పరిమితి ఏడాది వరకూ ఉండేది. అయితే టెలికామ్‌ కంపెనీలకు సంబంధించిన ప్రతినిథులు మాత్రం ఇది టిఆర్‌ఎ డెసిషన్‌గా చెబుతున్నారు. దాంతో టిఆర్‌ఎ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com