రాజేంద్రప్రసాద్ కు షాక్ ఇచ్చినట్లు టాక్
- October 19, 2015
గత వారం రానా ఇంట్లో కొంత మంది యంగ్ హీరోలు హీరోయిన్స్ కలిసి లంచ్ సమయంలో చర్చించుకున్న విషయాలు 'మా' సంస్థ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ దృష్టి వరకు వెళ్ళడంతో రాజేంద్రుడు బన్నీ రానా లపై అసహనంగా ఉన్నట్లు టాక్. భారీ సినిమాలు ఒక దాని వెనుక మరొకటి రిలీజ్ అవుతూ ఉండటంతో ఈ భారీ సినిమాల మధ్య చిన్న సినిమాలు నలిగిపోతున్న విషయమై దృష్టి పెట్టి వీటి వల్ల నష్టపోతున్న దర్శక నిర్మాతలు నటీనటులు ఎదుర్కుంటున్న సమస్యల పై ఏర్పాటు చేసిన ఈ లంచ్ మీట్ కు సంబంధించిన వార్తలు చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ లంచ్ మీట్ లో పాల్గొన్న రామ్ చరణ్, వరుణ్ తేజ్, సందీప్ కిషన్, నాని, సాయి ధర్మతేజ, నిఖిల్, సుశాంత్, తరుణ్, రకుల్ ప్రీత్, మంచులక్ష్మి లాంటి వారు అంతా ప్రస్తుత టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి 'మా' సంస్థ దగ్గరకు వెళ్లడంకన్నా ఇలాంటి లంచ్ మీటింగ్ లే బాగుంటాయని అని కామెంట్ చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలు 'మా' సంస్థ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కు షాక్ ఇచ్చినట్లు టాక్. అంతేకాదు సినిమా సమస్యల పై ఎవరికీ వారు ఇలా చిన్నచిన్న పార్టీలు ఏర్పాటు చేసుకుని, ఎవరికీ వారు ఇలా కామెంట్లు చేసుకుంటే ఎలా అని రాజేంద్రప్రసాద్ అసహనం వ్యక్త పరుస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా గతవారం రానా ఇంట్లో కలుసుకున్న నటీనటులు అంతా ఇటువంటి లంచ్ సమావేశాలు మరిన్ని నిర్వహించుకుంటూ తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలని నిశ్చయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఇటువంటి సమావేశాన్ని ఒక యంగ్ హీరో ఇంట్లో ఏర్పాటు చేసి ఆ సమావేశానికి మణిరత్నంతో పాటు దీపిక పదుకొనె లను అతిధులుగా పిలవడానికి నిశ్చయించుకున్నట్లు టాక్. దీనిని బట్టి చూస్తూ ఉంటే 'మా' సంస్థకు పోటీగా మరో సంస్థ ఏర్పడబోతోందా ? అన్న సందేహం కలుగుతోందని కామెంట్స్ వినపడుతున్నాయి..
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







