గన్నవరం విమానాశ్రయం లో నూతన టెర్మినల్ శంకుస్థాపన..!!
- October 19, 2015
నవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులకు సోమవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసారు . అధునాతన సౌకర్యాలతో నిర్మించనున్న ఈ టెర్మినల్ భవవ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.137 కోట్లు మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీని నిర్మాణం పూర్తయితే ఒకేసారి 500 మంది ప్రయాణికులకు వసతి కల్పించే అవకాశం ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణలతో పాటు.. రాష్ట్ర మంత్రులు, స్థానిక టీడీపీ నేతలు హాజరు అయినారు . ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విమానాశ్రయం డైరెక్టరు ఎం.రాజకిశోర్ చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







