గ్యాసోలైన్ రంగు మార్పు: గ్యాస్ స్టేషన్ మూసివేత
- July 15, 2017
రియాద్: రెడ్ పౌండర్‌ని, గ్యాసోలైన్లో మిక్స్ చేసి, తద్వారా గ్రీన్ నుంచి రెడ్ కలర్‌కి గ్యాసోలైన్ని మార్చేసి వినియోగదారుల్ని మోసం చేస్తున్న కేసులో ఓ గ్యాస్ స్టేషన్‌ని అధికారులు మూసివేశారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్ ఇన్స్పెక్టర్స్ ఈ మోసాన్ని గుర్తించి, తగిన పరీక్షలు నిర్వహించి, గ్యాస్ స్టేషన్ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. 91 ఆక్టేన్ గ్యాసోలైన్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రంగు మార్చడం ద్వారా 91 ఆక్టేన్ గాసోలైన్ని 95 గాసోలైన్గా విక్రయించి అధికంగా సొమ్ము చేసుకుంటున్నారు గ్యాస్ స్టేషన్ నిర్వాహకులు. ఓ వినియోగదారుడు అందించిన సమాచారం మేరకు అధికారులు ఈ దాడులు చేశారు. ఇంకో వైపున మరో వినియోగదారుడి ఫిర్యాదుతో కింగ్ ఖాలిద్ రోడ్‌లోని ఓ ఫ్యూయల్ స్టేషన్లో ప్రైస్ ట్యాంపరింగ్ జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







