జువైనైల్స్‌ వయసు పెంపుకి రెడ్‌ సిగ్నల్‌

- July 15, 2017 , by Maagulf
జువైనైల్స్‌ వయసు పెంపుకి రెడ్‌ సిగ్నల్‌

మనామా: జువైనెల్స్‌ వయసుని 15 నుంచి 18 వరకు పెంచే ప్రతిపాదనను లెజిస్లేటివ్‌ ప్యానెల్‌ తిరస్కరించింది. ఫారిన్‌ ఎఫైర్స్‌, డిఫెన్స్‌ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ కమిటీ - హౌస్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌ ఈ ప్రపోజల్‌ని అంగీకరించలేదు. చట్టంలో మార్పు చేయాల్సి వస్తే బహ్రెయినీ చైల్డ్‌ కోడ్‌ తాలూకు ఉద్దేశ్యం దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రపోజల్‌ ప్రెజెంటర్‌ ఎంపీ రౌవా అల్‌ హాయ్కీ మాట్లాడుతూ, 16-18 ఏళ్ళ మధ్య వయసువారిని చిన్న పిల్లల్లానే ట్రీట్‌ చేయాలని యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఆన్‌ రైట్స్‌ ఆఫ్‌ చైల్డ్‌ పేర్కొంటుందని చెప్పారు. ఇది చాలా సున్నితమైన విషయమనీ, నేరాల్లో ఇరుక్కున్న ఈ గ్రూప్‌ వారి విషయంలో సామాజిక కోణం ముఖ్యమని అల్‌ హాయ్కీ చెప్పారు. తదుపరి పార్లమెంట్‌ మీటింగ్‌లో ఈ ప్రపోజల్‌ రివ్యూ చేయబడుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com