వక్కతం వంశీ డైరెక్టర్ గా నందమూరి సోదరులు
- October 19, 2015
నందమూరి సోదరులు జూ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కలిసి పని చేయబోతున్నారు. నిర్మాతగా ఇప్పటికే పలు చిత్రాలు నిర్మించిన కళ్యాణ్ రామ్ త్వరలో తన సోదరుడు జూ ఎన్టీఆర్ హీరోగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో ఈసినిమా తెరకెక్కబోతోంది. టాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాలకు కథా రచయితగా తన సత్తా చాటిన వక్కతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారబోతున్నాడు. కిక్, రేసు గుర్రం, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కతం వంశీ ఇప్పటికే ఎన్టీఆర్ కు కథ వినిపించాడు. ఎన్టీఆర్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. వాస్తవానికి 'టెంపర్' కథతోనే వక్కతం వంశీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. అయితే ఎన్టీఆర్ కోరిక మేరకు పూరికి ఆ కథ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నీతో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట కూడా ఇచ్చినట్లు టాక్. ఆ మాట మేరకే ఎన్టీఆర్ ఇపుడు వక్కతం వంశీని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'నాన్ను ప్రేమతో' షూటింగులో ఉన్న జూఎన్టీఆర్... దీని తర్వాత కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది పూర్తయిన తర్వాత అంటే 2016 వేసవిలో వక్కతం వంశీతో సినిమా మొదలు కానుంది. జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి పని చేయాలని గతేడాదే నిర్ణయించుకున్నారు. ఎట్టకేలకు వీరి కాంబినేషన్లో సినిమా ఖరారైంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







