8వ సారి వింబుల్డన్‌ గెలిచిన రోజర్ ఫెదరర్‌

- July 16, 2017 , by Maagulf
8వ సారి వింబుల్డన్‌ గెలిచిన రోజర్ ఫెదరర్‌

స్విస్‌ టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఘనత సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో ప్రత్యర్థి మారిన్‌ సిలిచ్‌ను 6-3, 6-1, 6-4 తేడాతో వరుస సెట్లలో చిత్తు చేశాడు. 35 ఏళ్ల వయసున్న ఫెదరర్‌కు ఇది ఎనిమిదో వింబుల్డన్‌ టైటిల్‌ కాగా 11వ ఫైనల్‌. మొత్తం మీద 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఓపెన్‌ శకంలో 29 మేజర్‌ ఫైనల్స్‌ ఆడిన ఆటగాడిగా ఫెదరర్‌ రికార్డు సృష్టించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com