రామ్ గోపాల్ వర్మ ఎందుకు మాట్లాడ్డం లేదంటే?
- July 17, 2017
టాలీవుడ్ మొత్తం కుతకుత ఉడికిపోతోంది. రేపు ఏం జరుగుతుందోనన్న గుబులు ప్రతీ సినిమా సర్కిల్ నీ పిచ్చెక్కిస్తోంది. మాదకద్రవ్యాల ఉచ్చులో పడి దాదాపు టాలీవుడ్ పెద్ద కుటుంబాలన్నీ గిలగిల్లాడిపోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ.. తెలుగు సినిమా చౌరస్తాలో నిలబడి, ప్రతి సందర్భానికీ స్పందించే అలవాటున్న రామ్ గోపాల్ వర్మ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఆయన ట్విట్టర్ అంటే మూసుకుపోయింది. కనీసం ఇన్ స్టాగ్రామ్ లోనైనా ఓ ముక్క మాట్లాడొచ్చుగా అంటూ అటు అభిమానులు, ఇటు విమర్శకులు సూటిగానే ప్రశ్నిస్తున్నారు.
ప్రతి అంశాన్ని సమర్థించడమో లేదా విమర్శించడమో చేసే 'మంచి' అలవాటున్న వర్మ.. ఆ విధంగా తన ఉనికిని కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యారు కూడా. నిజానికి. వర్మ సినిమాల కంటే.. వర్మ ట్వీట్ల కోసమో, టీవీల్లో వర్మ ఇంటర్వ్యూల కోసమో మాత్రమే జనం ఎదురుచూస్తారు. వర్మ మార్క్ నిశిత విమర్శ మీద సినిమా, సినిమాయేతర వర్గాల్లో కూడా అంతులేని ఆసక్తి. వర్మ స్టైల్ ఆఫ్ క్రిటిసిజాన్ని ఇష్టపడేవాళ్ళూ ఎక్కువే. ఒక వివాదాన్ని గానీ, ఒక ఘటనను గానీ వర్మ చూసే కోణం విశిష్టంగా ఉంటుందని చెప్పుకుంటారు. అటువంటి వర్మ.. ఇంతటి సంక్షోభ సమయంలో కూడా చిత్రపరిశ్రమని 'ఒంటరి'గా వదిలెయ్యడం భావ్యం కాదు !
ఆ మధ్య ట్విట్టర్ ని వదిలేస్తున్నానంటూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. షార్ట్ ఫిలిమ్స్ తో ప్రకంపనలు సృష్టించడం మొదలుపెట్టారు. ఇటీవల ఎన్టీయార్ బయోపిక్ తీస్తానంటూ ఒక వాయిస్ ప్రజెంటేషన్ ని జనం మీదకు వదిలి.. జడిపించేశారు. బహుశా.. ఆ 'భయోపిక్' మేకింగ్ లో బిజీగా ఉన్నారా లేక.. మరెక్కడికైనా వెళ్లిపోయారా? అంటూ వర్మ ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. కాకపోతే.. వర్మ కూడా 'డ్రగ్స్' వాసన తెలిసినవాడేనన్న వాదన ఒకప్పుడు ఫిలిం సర్కిల్స్ లో నడిచింది. ఈ డ్రగ్స్ గొడవలో తల దూర్చడం శ్రేయస్కరం కాదని సైలెంట్ అయిపోయారా? కానీ.. పేరులోనే 'వోడ్కా'ను వాడుకున్న వర్మ.. ఈ చప్పుళ్లకు భయపడే ఛాన్సే లేదన్నది అతడి ఫ్యాన్ క్లబ్ భరోసా !
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









