చేతివాటం చూపిస్తున్న విమానాశ్రయ సిబ్బంది అరెస్ట్
- July 19, 2017
మనామా: " ఇంటి ..దొంగను ..ఈశ్వరుడైన పట్టలేడనేది " పాత సామెత కానీ, సిసి కెమెరాలు వచ్చిన తర్వాత ఎటువంటి గజ దొంగలునైనా గజ గజలాడిస్తున్నాయి. గత వారం బహ్రేన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల సామాను నుండి వివిధ వస్తువులను చాకచక్యంగా దొంగిలిస్తున్న ఇద్దరు విమానాశ్రయ సిబ్బందిని విమానంలో ఉన్న నిఘా కెమెరాలు పట్టి ఇచ్చిన ఘటన గత వారం వెలుగులోకి వచ్చాయి. ఒక ఎమిరేట్స్ విమానం వెనుక ఉన్న పర్యవేక్షణ కెమెరాలు ప్రయాణికుల బ్యాగుల నుండి దొంగిలిస్తున్న ఇద్దరు నేరస్థులను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. విమానంలో నిఘా కెమెరా ఈ దొంగతనాన్ని నమోదు చేసింది. ఎయిర్లైన్స్ వెంటనే ఈ కేసును బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీకి నివేదించింది. పోలీసులు నోటిఫికేషన్ ఇచ్చారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ గత బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇద్దరు ఆసియా దేశస్థులు ప్రయాణీకుల సంచులను తెరిచి, విలువైన వస్తువులను దొంగిలించడం రుజువు కావడంతో వారిని అరెస్టు చేశారు. ఈ విమానాల పరిసరాల నుంచి వారిని నిషేధించారు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం, ఆ దొంగ ఉద్యోగుల వయస్సు 20 ఏళ్ళు ఒకరిది కాగా మరొకరిది 24 ఏళ్ల అనుమానితులు భద్రతా తనిఖీ ప్రాంతంలో ప్రయాణికుల సామాను లోడ్ చేసే ముందు విలువైన వస్తువులను అపహరించేందుకు ప్రయాణీకుల సామానును అన్వేషిస్తారు. "ఎయిర్లైన్స్ సంస్థను ఈ సంఘటన సంబంధించి 16 ఫోటోలతో దోషపూరిత సాక్ష్యంను కోర్టుకు అందించింది. ఈ దోమలు అనేక మొబైల్ ఫోన్ ఛార్జర్లు, హెడ్సెట్లు, సాక్స్లు, స్వీట్స్ మరియు సిగరెట్ల ప్యాకెట్లు పెద్ద మొత్త్తంలో వారి నుంచి స్వాధీనం చేసుకొన్నారు. వీరిద్దరికి మూడవ అదనపు నేర న్యాయ స్థానం ఆరేళ్ళ జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణను విధించారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









