తమిళ హీరో ఉదయనిధి చిత్రానికి యు సర్టిఫికెట్‌

- July 19, 2017 , by Maagulf
తమిళ హీరో ఉదయనిధి చిత్రానికి యు సర్టిఫికెట్‌

ఇటీవల వరుస విజయాలను అందుకుంటున్న యువ నటుల్లో ఉదయనిధి స్టాలిన్‌ ఒకరు. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన సవరణన్‌ ఇరుక్క భయమేన్‌ చిత్రం ప్రేక్షకాదరణను పొందింది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం పొదువాగ ఎన్‌ మనసు తంగం. మదురై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్‌ గ్రామీణ యువకుడిగా కనిపించనున్నారు. ఆయనకు జంటగా నివేదాపేతురాజ్‌ నటించారు. ఇందులో పార్థిబన్, సూరి, మయిల్‌స్వామి ముఖ్యపాత్రలు పోషించారు.
దళపతి నవదర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. డి.ఇమాన్‌ సంగీతాన్ని,  బాలసుబ్రమణియం ఛాయాగ్రహణం అందించారు. తేని, మదురై, కోవై, సత్యమంగళం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ పొదువాగ ఎన్‌ మనసు తంగం చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను జరుపుకుని యూ సర్టిఫికెట్‌తో విడుదలకు సిద్ధం రెడీ అయ్యింది. చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.  ఈ చిత్రం పూర్తి కావడంతో ఉదయనిధిస్టాలిన్‌ తాజాగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో నటించే చిత్రంపై దృష్టి పెట్టారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com