సోనాక్షి సిన్హా హీరోయిన్ గా అవార్డు ఫంక్షన్ల వేదిక 'ఐఫా' పై ఓ సినిమా

- July 20, 2017 , by Maagulf
సోనాక్షి సిన్హా హీరోయిన్ గా అవార్డు ఫంక్షన్ల వేదిక 'ఐఫా' పై ఓ సినిమా

ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) పై సినిమాని నిర్మిస్తున్నారు బాలీవుడ్ నిర్మాత వశు భగ్నానీ. ఇందులో సోనా‌క్షి సిన్హా, దిల్జీత్ దొసాంజ్ జంటగా నటిస్తున్నారు.  స్టేజ్ రియాల్టీ కార్యక్రమం నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే కావడం విశేషం.  ఈ సినిమా మొత్తం కామెడీగానే ఉంటుందని ఇందులో నటిస్తున్న సోనాక్షి తెలిపింది.  మరో నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడు.  
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఈ ఐఫా అవార్డులు ప్రధానం చేస్తుంటారు.  2000లో మొదలైన ఈ ఐఫా తొలి వేడుకలు లండన్‌లోని మిలీనియం డోమ్‌లో నిర్వహించారు. ఏటా ఒక్కో దేశంలో ఈ ఐఫా ఉత్సవాలు నిర్వహిస్తారు.  ఐపాకు తొలి నుంచీ అమితాబ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com