ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ వారిచే హరితహారం పోస్టర్స్ విడుదల
- July 20, 2017
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ హరితహారం డోర్ స్టికర్ పోస్టర్స్ ను ఆవిష్కరించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి.
జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో విడత ఆకుపచ్చ హరితహారం రాష్ట్రానికి మణిహారంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీనిని విజయవంతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరు భాగస్వాములు కావాలని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి దిశానిర్దేశం చేశారు. అనంతరం భూషణరావుపేట లోక బాపురెడ్డి నివాసంలో నిర్వహించిన తెరాస మండలస్థాయి హరితహారం సమావేశంలో బాగంగా ప్రతి గ్రామ పంచాయతీలలో ప్రతిఒక్కరు మొక్కలు నాటలంటు ప్రజలలో అవగాహన పెంచెందుకు మన మండలానికి చెందిన బహ్రెయిన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ సభ్యులు, సిరికొండ రాధారపు సతీష్ కుమార్ మరియు ఊట్ పల్లి కి చెందిన బోలిశెట్టి వెంకటేష్ లు ప్రజలలో అవగాహన పెంచెందుకు రూపొందించిన డోర్ స్టికర్ పోస్టర్లను మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి చేతుల మీదుగా గురువారం నాడు ఆవిష్కరించి వారు చేస్తున్న కార్యక్రమాలను అభినందించి అనందం వక్తం చేశారు. ఈ సందర్భంగా మన సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ చక్కటి హరితహారం కార్యక్రమం ద్వారా భావితరాలకు ఎంతో మేలు చేకూరనుందని ప్రతిఒక్కరూ భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని లోక బాపురెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగం భూమయ్య, వర్ధినేని నాగేశ్వర్రావు, నాంపెల్లి లింబాద్రి, ఏజీబి మహేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







