విమానంలో ఎలక్ట్రానిక్స్ నిషేధంను ఎత్తివేసిన సౌదీ అరేబియా ఎయిర్లైన్స్

- July 20, 2017 , by Maagulf
విమానంలో ఎలక్ట్రానిక్స్ నిషేధంను ఎత్తివేసిన సౌదీ అరేబియా ఎయిర్లైన్స్

జెడ్డా: ప్రయాణీకులు తమ విమానంలో పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లరాదనే నిషేధం ఎత్తివేసినట్లు   సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ (సౌడియా), కింగ్డమ్ జాతీయ క్యారియర్ తెలిపింది. అమెరికాకు వెళ్లే  అన్ని విమానాలలో  ప్రయాణించే ప్రయాణీకులు జూలై 19 వ తేదీ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడానికి వీలు కల్పించారు. ఇదే విషయాన్ని ఎయిర్లైన్స్ అధికారులు సైతం ధ్రువీకరించారు. ఎయిర్ లైన్స్ ధృవీకరించిన ఎయిర్ జనరల్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ అమెరికా రవాణా సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కేబిన్ లో  లక్ట్రానిక్ పరికరాలను మోసుకెళ్లేందుకు నిషేధాన్ని ఎత్తివేసింది. జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  నుంచి మరియు రియాద్ లోని  కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అమెరికాకు ప్రయాణిస్తున్న విమానం క్యాబిన్ లో పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచారు. విమానాశ్రయాల వద్ద భద్రతా విధానాలను టి ఎస్ ఏ బృందం క్షుణంగా పరిశీలించిన తరువాత ఈ నిషేధం ఎత్తివేయబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com