సౌఖ్ వక్కిఫ్ ' ఖర్జూర పండుగ ' జులై 27 వ తేదీ నుంచి ప్రారంభం
- July 20, 2017
ఈ నెల జూలై 27 వ తేదీ నుంచి సౌక్ వాకిఫ్ వద్ద తాజా ఖర్జూర పండుగ ప్రారంభం కానుందని మునిసిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఇది సందర్శకులకు చౌక ధరలతో ఖర్జూరాలు లభ్యం కావడమే కాక ఖర్జూరాలను ప్రదర్శిస్తారు. స్థానికంగా 57 ఖర్జూర పొలాలు ఈ ఉత్సవంలో పాల్గొననున్నాయి. ఖర్జూరాలలో వివిధ ఉత్తమ రకాలైన ఖలాస్, ఖానిజీ, బారు మరియు షిషి వంటి రకాలు అందుబాటులో ఉంటాయి. దేశం ప్రస్తుత ఆర్థిక దిగ్బందంలో ఉండగా ఈ పండుగ నిర్వహించబడుతోంది. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ,మద్దతు తెలిపేందుకు దోహదపడనుంది. ' ఖర్జూర పండుగ ' నిర్వహణ ద్వారా ఆహార భద్రతను సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రిత్వశాఖ వ్యవసాయ సంబంధ అఫిరైస్ విభాగం సౌఖ్ వఖీఫ్ మేనేజ్మెంట్ సహకారంతో ఈ పండుగను నిర్వహిస్తోంది. ఖర్జూరాలు రాయితీ ధరల వద్ద కూడా అందుబాటులో ఉంటుంది.గత ఏడాది మొత్తం ఖర్జూరాలు ఉత్పత్తి 28,877 టన్నులు కాగా 81 శాతం స్థానిక డిమాండ్ ను సాధించగలిగింది. మిగిలినవి ఒమన్ మరియు ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యాయి. దేశంలో 1,307 రిజిస్ట్రేషన్ పొలాలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 902 ఉత్పాదక ఖర్జూరాలు ఉన్నాయిని మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







