సౌదీ ప్రిన్స్ అధికార దుర్వినియోగం....శిక్షించమని కింగ్ సల్మాన్ ఆదేశం
- July 20, 2017
జెడ్డా: చట్టాలు ఎవరికీ చుట్టాలు కావని నిరూపించే సంఘటన ఇది. న్యాయం ధర్మం ఎదుట అందరు సమానమేనని సౌదీ అరేబియాలో జరిగింది. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రాచుర్యం చెందిన వీడియో సౌదీ రాజ కుటుంబ సభ్యుడి అరెస్టు కు దారి తీసింది. సౌదీలో రాజకుటుంబానికి చెందిన యువరాజు సౌదీ బిన్ అబ్దుల్లాజిజ్ బిన్ మ్యూసేద్ బిన్ సౌద్ బిన్ అబ్దుల్లాజిజ్ అల్ సౌద్ ఇటీవల ఓ బహిరంగ ప్రదేశంలో ఇటీవల కొందరు సౌదీ పౌరులతో గొడవపడ్డారు. వాళ్లను దూషించడమే కాకుండా, ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేసి పలువుర్ని కొట్టడం జరిగింది. కాగా ఈ యువరాజు చేసిన నిర్వాకాన్నంతా ఓ పౌరుడు మొబైల్ ఫోన్ లో వీడియో తీసి ట్విటర్లో పెట్టారు. " రాజులు ఏమి చేసినా...చెల్లుతుందంటూ.. సామాన్యులు కదా బలి అయ్యేదని " వ్యంగార్ధం వచ్చేలా వ్యాఖ్యతో ఆ వీడియో పోస్ట్ చేశాడు. దాంతో ఆ పోస్ట్ దేశమంతా చుట్టేసింది. చివరకు సౌదీ రాజు సల్మాన్ దృష్టికి సైతం వచ్చింది. వెంటనే ఆయన అధికారులకు ఆజ్ఞ జారీ చేశారు. దీంతో నానా రభస చేసిన సౌదీ యువరాజును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో ఏకంగా రాజ కుటుంబానికి చెందిన వ్యక్తినే జైలుకు పంపించడంతో రాజు పాలనా దక్షత గురించి సౌదీ ప్రజల్లో చర్చనీయాంశమయింది. పౌరుల పట్ల అసంబద్ధమైన ప్రవర్తనకు పాల్పడిన నేరానికి సౌదీ రాజు సల్మాన్ ఇచ్చిన ఆదేశాల మేరకు గత రాత్రి యువరాజు సౌద్ బిన్ అబ్దుల్జాజ్ బిన్ ముసాద్ బిన్ సౌద్ బిన్ అబ్దుల్జిజ్ అల్ సౌద్ ను ను అరెస్ట్ చేశారు.ఆంతరంగిక మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం,ఈ సౌదీ రాజ్య కుటుంబ సభ్యునికి వ్యతిరేకంగా మొదటిసారి చట్టపరమైన చర్య వేగంగా, బహిరంగంగా తీసుకోబడింది గత అక్టోబర్ లో సౌదీ పౌరుడు అయిన ఆడెల్ బిన్ సులైమాన్ బిన్ అబ్దుల్ కరీం అల్ ముహైమైడ్ ను చంపినందుకు ప్రిన్స్ టర్కీ బిన్ సౌద్ బిన్ టర్కీ బిన్ సౌద్ అల్ కబీర్ మంగళవారం హతమార్చిన విషం ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









