ప్రమాదాలు తగ్గించేందుకు కొత్త ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ : ఎంపీ ప్రతిపాదన

- July 21, 2017 , by Maagulf
ప్రమాదాలు తగ్గించేందుకు కొత్త ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ : ఎంపీ ప్రతిపాదన

రాజధానిలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలలో నూతన పద్ధతులను అమలు చేయవలసి ఉంటుందని , ఇది రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి ఉద్దేశించినదని ఎంపీ  మొహమ్మద్ అల్ మరాఫీ చెప్పారు. ఆయన గత వారం  ట్రాఫిక్ సిగ్నల్స్ వైవిద్య రీతిలో సర్దుబాటు చేసే విధంగా ఒక నూతన ప్రతిపాదనను సమర్పించారు. ట్రాఫిక్ లైట్లు  ఆకుపచ్చ రంగు  నుండి మారడానికి ముందు అనేక సార్లు " మిణుకు మిణుకు మని   వెలగడం " అవుతుంది. ప్రతినిధుల సభలో మానవ హక్కుల కమిటీకి నాయకత్వం వహించే ఎంపీ ట్రాఫిక్ లైట్లు సర్దుబాటు చేయాలని  పేర్కొన్నారు, రహదారులపై  ట్రాఫిక్ లైట్లు  మారుతున్నవేళ ఆకుపచ్చ రంగులో అయిదు సార్లు  తళుక్కున వెలగడం ముఖ్అంచిదని తద్వారా  డ్రైవర్లకు  వెంటనే ఆ సూచన  తెలియజేయడానికి అవకాశముంటుందని పసుపు రంగులో నుంచి ఎరుపు రంగులో మారే ముందు ఇలా ఉండాలని సూచించారు.  "ఈ ప్రతిపాదన ట్రాఫిక్ భద్రతని సరిగా  నిర్వహించడం మరియు ప్రమాదాలు నివారించేందుకు దోహదపడగలవాని ఎంపి పేర్కొన్నారు. అంతేకాక నాలుగు కూడళ్ల సమీపంలో ఉల్లంఘనలను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది" అని ఎం పి అల్ మారీఫి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com