'గౌతమ్ నంద' సెన్సార్ పూర్తి

- July 21, 2017 , by Maagulf
'గౌతమ్ నంద' సెన్సార్ పూర్తి

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". రొటీన్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హన్సిక-కేతరీన్ కథానాయికలు. శ్రీబాలాజీ సినీ మీడియా సంస్థలో జె.భగవాన్-జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. దాదాపు 2.30 గంటల నిడివి గల "గౌతమ్ నంద" ఆద్యంతం ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com