దుబాయ్ మాల్ లోపల ట్రాఫిక్ రాడార్లు?

- July 22, 2017 , by Maagulf
దుబాయ్ మాల్ లోపల ట్రాఫిక్ రాడార్లు?

దుబాయ్: మీరు దుబాయ్ లో  రోడ్డు మీద పోలీసుల సూపర్ కార్లు చూడటమే కాదు దుకాణాలలో రాడార్ పరికరాలను ఏర్పాటు చూసి తే ఆశ్చర్యపడకండి. మీకేమీ  జరిమానా విధించబడదు - రహదారి భద్రత గురించి మీకు బోధించబడుతుంది అంతే !!. దుబాయ్ పోలీస్,  సివిల్ డిఫెన్స్, అల్ అమీన్ సీక్రెట్ సర్వీస్ మరియు ఆటోప్రోతో కలిసి దుబాయ్ అవుట్లెట్ మాల్ లో " ప్రమాదాలు లేని వేసవికాలం " అనే ఒక అవగాహన ప్రచారంను దుబాయ్ పోలీస్ ప్రారంభించింది.  వేసవి నెలల్లో రోడ్డు భద్రతను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. రోజూ వాహనాల టైర్లు, బ్రేక్ పాడ్స్ , రేడియేటర్లను పరిశీలించడంపై ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రచారం చేస్తుంది. ఈ కారును రోడ్డు మీదకు వెళ్లేందుకు అనుకూలం అని భరోసా ఇస్తుంది. దుకాణ సందర్శకులు మాల్ యొక్క సెంటర్ కోర్టు, రోడ్ రాడార్లలో ప్రదర్శన కోసం దుబాయ్ పోలీస్ లగ్జరీ పోలీస్ కార్లను చూడవచ్చు. పోలీసు కెమెరాలచే అధిక స్పష్టతతో కూడిన వీడియో పర్యవేక్షణ నిర్వహించ బడ నుంది..దుబాయ్ పోలీసులు రహదారులపై భద్రత యొక్క ప్రాముఖ్యతపై బ్రోచర్లను పంపిణీ చేసింది. అంతేకాక  ప్రమాదాలు నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలో సైతం విస్తరించనుంది.. సివిల్ డిఫెన్స్ ట్రాఫిక్ భద్రతా అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తోంది మరియు రోడ్డు భద్రతను ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమాలలో వినోద వర్క్ షాప్ లు, పిల్లలను కోసం ఆటలు, మంటలను ఆర్పే అగ్నిమాపక శిక్షణ తదితర కార్యక్రమాలు జరపనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com