ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తీసుకెళితే ఆ మొత్తాన్ని ప్రకటించండి

- July 23, 2017 , by Maagulf
ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తీసుకెళితే ఆ  మొత్తాన్ని ప్రకటించండి

కువైట్ : ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తమ వెంట  తీసుకెళితే ఆ  మొత్తాన్ని ప్రకటించండని డైరెక్టర్ జనరల్ జమాల్ అల్-జలావీ ప్రయాణికులను కోరారు. 3000 కువైట్ దినార్ల కంటే  ఎక్కువ  మొత్తాన్ని తరలిస్తే , వారి రాక పోకల సమయంలో  తరువాత చట్టం 106/4 ప్రకారం అధికారులకు విధిగా తెలియచేయాలని ఆయన కోరారు. . పౌరులు మరియు నివాసితులు డబ్బు తరలించడం నేరమైతే కాదు కానీ ఎంత మొత్తంలో తీసుకెళుతున్నారో తెలియచేయాలని వారి డబ్బుపై కువైట్ తరఫునుంచి ఎలాంటి పరిమితి లేదని ఆయన ప్రకటించారు.  కువైట్ అక్రమనగదు బదిలీపై  పోరాడటానికి కఠినమైన చట్టం అమలువుతుంది.  అంతేకాక , ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేరే అపరిచితులు విమానాశ్రయాలలో  తమ సామానులు కాస్తంత పట్టుకోండని అడిగితే  సహాయం చేయవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. నిషేధిత పదార్ధాలను తరలించేవారు తోటి ప్రయాణికులతో ఇలా వ్యవహరిస్తారని అన్నారు. ఒకవేళ ఎవరైనా అమాయకంగా వారి సన్నులు తీసుకొంటే..పోలీసులు  స్వాధీనం చేసుకున్నప్పుడు  నేరస్తునితో పాటు ఆ ప్రయాణికుడికి శిక్ష తప్పదని అన్నారు.నిషేధిత వస్తువుల జాబితా గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయాణీకులు కస్టమ్స్ డిపార్ట్మెంట్ లేదా దాని పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ను సందర్శించాలని సిఫారసు చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com