ఇండోనేషియాలోని పడవ మునిగి..10మంది మృతి
- July 25, 2017
ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు జర్మన్ జాతీయులతో సహా మొత్తం పది మంది చనిపోయారు. ఉత్తర బోర్నియో ద్వీపంలోని తారకన్ నుంచి 51 మందితో ఓపడవ తాన్జుంగ్సెలార్ వైపు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభించిన పది నిమిషాల్లోనే పడవను బలమైన అల తాకటంతో బోల్తా పడింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి 23మందిని రక్షించగలిగారు.
అలాగే, రెండేళ్ల చిన్నారి సహా ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. వీరిలో ఇద్దరు జర్మన్లు. మిగతా వారి జాడ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇండోనేషియాలో మొత్తం 17వేల వరకు దీవులున్నాయి. అక్కడి ప్రజల రవాణాకు పడవలపైనే ఆధారపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తరచూ పడవ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ఆరంభంలో తిడుంగ్ దీవిలో జరిగిన పడవ ప్రమాదంలో 23 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









