ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఏపీ సీఎం చంద్రబాబు
- July 25, 2017
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ఆ తర్వాత ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. అటు హోంమంత్రి భేటీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు.
ఢిల్లీలో సిఎం చంద్రబాబుబిజీ బిజీగా గడిపారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైన సిఎం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత గ్రామీణావృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ని కలిసి ఉపాధి హామీ నిధులు రూ.1351 కోట్లు విడుదల చేయాలని కోరారు. రాజధానికి అటవీ భూములను కేటాయించాలని కేంద్రమంత్రి హర్షవర్దన్‌కు విజ్ఞప్తి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి కాకినాడ దగ్గర పెట్రోలియం కారిడార్, ఇంకా ఏమేమి రావాలో వాటన్నింటిపై చర్చించినట్లు సీఎం చెప్పారు. ఎన్విరాన్మెంట్పై ప్రధానంగా ఐదు అంశాలు ఉన్నాయని, రాజధానికి 12500 ఎకరాల భూమితోపాటు.. ఏపీకి రావాల్సిన అన్నింటిపై ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో చంద్రబాబు చర్చించారు.
ఏపీలో అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చంద్రబాబు చర్చించారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఇంకా కొన్ని నెరవేరలేదని, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్‌తో సమావేశమైన చంద్రబాబు సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీల గురించి చర్చించారు.వాటిని సాధ్యమైనంత త్వరగా మంజూరు ,చేయాల్సిందిగా మంత్రిని కోరారు. అటు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పరిశ్రమలకు భూ కేటాయింపు, కొల్లేరు సరస్సు సమస్య, ఎర్రచందనానికి సంబంధించి బీఎస్ఐ నుంచి పర్మిషన్ తదితర విషయాలపై పర్యావరణ శాఖ మంత్రితో సిఎం చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరగా మంజూరు చేయాల్సిందిగా కేంద్రమంత్రులను కోరినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







