ఏడారిలో తప్పిపోయిన యాక్టరస్ ప్రణీత
- July 25, 2017
పెద్ద పెద్ద కళ్లు...చూపులతో మెస్మరైస్ చేసే అందం ఆ నటిది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్స్ లేక. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ పై కన్నేసింది. అక్కడ ఆఫర్స్ బాగా పలకరించడంతో అక్కడ సెటిల్ అయిపోయింది. ఐతే ఇటీవలే కాలంలో ఓ సినిమా షూటింగ్ కోసం ఖతర్ వెళ్లింది. అక్కడ ఆ ఏడారి ప్రాంతంలో ఆమె మిస్సైపోయిందట. ఇంతకీ ఎవరు ఆ నటి....?
2016లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ మరదలు క్యారెక్టర్ చేసింది హీరోయిన్ ప్రణీత. ఆ తర్వత తెలుగు సినిమల్లో ఆఫర్స్ బాగా తగ్గిపోయాయి. దీంతో సొంత బాషా కన్నడ చిత్రసీమ పై ఫోకస్ పెట్టింది. అక్కడ ఆఫర్స్ తో తీరిక లేకుండ సినిమాలో నటిస్తోంది ప్రణీత. ప్రస్తుతం ఆమె శివరాజ్ కుమార్ సరసన ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఒక సాంగ్ ఏడారి బ్యాక్ డ్రాప్ లో షూట్ చేశారు. పేకప్ చెప్పేశాక అంతా అక్కడి నుంచి బయల్దేరారు. ఆ సమయంలో ఇసుక దిబ్బల మధ్య ప్రణీత ప్రయణిస్తున్న కారు తప్పిపోయింది. ఆ టైమ్ లో ఎక్కడ ఉన్నామో తెలియక ఆమె చాలా భయపడింది అటా. ఫిల్మ్ యూనీట్ ఆమె తప్పిపోయిన విషయం తెలుసుకొని సెల్ నెట్ వర్క్ ద్వారా ఆమె ఎక్కడ ఉందో తెలుసుకున్నారు. ఈ అనుభవం తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రణీత ఓ ఇంటర్వూలో తెలిపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







