గిన్నీస్ రికార్డ్ సాధించిన తమిళ దర్శకుడు కన్నుమూత
- July 25, 2017
సీనియర్ దర్శకుడు షిరాజ్(65) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈయన నటుడు రామరాజన్ హీరోగా ఎన్నై పెత్త రాసా, తంగత్తిన్ తంగం, ఏరెల్లామ్ ఉన్ పాట్టు, ఆనందరాజ్ కథానాయకుడిగా ఎన్ రాజ్యాంగం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్ రాజ్యాంగం చిత్రానికి ఆయనే నిర్మాత. కాగా 24 గంటల్లో తెరకెక్కిన గిన్నీస్ రికార్డు కెక్కిన స్వయంవరం అనే చిత్రానికి ఈయనే దర్శకుడు.
పలు చిత్రాలకు కథ, మాటలు అందించిన షిరాజ్ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం మిన్నల్ విడుదల కాకముందే ఆయన మరణించారు. కొద్ది నెలల కిందట అనారోగ్యానికి గురైన షిరాజ్ సోమవారం గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక చెట్పెట్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించటంతో షిరాజ్ కన్నుమూశారు. ఆయనకు భార్య ఆయేషా, కూతుళ్లు యాశ్విన్, మన్సుర, భాను ఉన్నారు. షిరాజ్ అంతక్రియలు మంగళవారం సాయంత్రం కోడంబాక్కం, పులియూర్ పురంలో గల ముస్లీంల శ్మశాన వాటికలో నిర్వహించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







