ఆగస్టులో వస్తున్న 'అర్జున్ రెడ్డి'
- July 25, 2017
పెళ్ళిచూపులు చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించిన హీరో విజయ్ దేవర కొండ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం 'అర్జున్ రెడ్డి'. షాలిని హీరోయిన్గా నటిస్తుంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచే మంచి హైప్ క్రియేట్ చేస్తుంది.
విలక్షణ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపే విజయ్ దేవర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనపడబోతున్నాడు. మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ ఫిలింస్‌తో పాటు కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ చివరి వారంలో విడుదల చేస్తున్నాయి.
పోస్టర్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై వచ్చిన అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజెనెస్‌కు క్రేజ్ ఏర్పడింది. విజువల్ వండర్ బాహుబలి 2 చిత్రాన్ని విడుదల చేసిన ఏషియన్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. రధన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వరలో మార్కట్లోకి విడుదల కానుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







