మహిళల మెడ నుండి బంగారు గొలుసు తెంచుకుపోయిన దొంగ
- July 25, 2017
రయ్ మని బైకుపై వచ్చి మహిళలల మెడ లోని బంగారు గొలుసుని తెంచుకొని రెప్పపాటులో మాయమయ్యే చైన్ స్నాచర్లు మన ప్రాంతాలలో ఆ తరహా చోరీలు మనకు విదితమే..." రాను...రాను... రాజు గారి గుర్రం.. గాడిదైనట్లు " ఆ తరహా నేరాలు గల్ఫ్ ప్రాంతాలలో మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం 7:30 గంటలకు రాజధాని ప్రాంతంలో ఓ 36 ఏళ్ల మహిళ మెడలోని బంగారు గొలుసును తెంచుకొని దొంగ పరారయ్యాడు. మనామా లోని షిఫా సమీపంలోని అల్ జజీరా ఆసుపత్రికి సమీపంలో నివసించే సింధు అనే మహిళ మనామలోని జవద్ హౌస్ లేన్ వద్ద తన స్నేహితురాలితో కలిసి నడుస్తుంది. . "నా భార్య జవద్ హౌస్ లేన్లో తన స్నేహితురాలితో, ముగ్గురు పిల్లలు మరియు నా 7 ఏళ్ల కుమారుడితో కలిసి నడుస్తుంది. ఆమె తన తల తిప్పి సమీపంలోని ఓ దుకాణంలో ఏదో వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళుతుండగా అకస్మాత్తుగా ఓ దొంగ సింధు మెడలోని గొలుసును లాక్కొని అక్కడ్నుంచి పారిపోయాడని సింధు భర్త మనోజ్ చెప్పారు." ఆ రాత్రి సి.సి.టి.వీ లో రికార్డ్ కాబడిన వీడియో సమాచారం సేకరించామని అందులో , నా భార్యను దాటికి ముందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఆమె తన వద్దకు వచ్చే వరకు వేచి ఉన్నాడు..ఆమె తన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసుని ఒక్క వుదుటన లాక్కొని పారిపోయాడుని తెలిపాడు. మేము పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాము మరియు పరిశోధనలు మొదలుకాబడ్డాయి. గతంలో కొన్ని నెలలు క్రితం అదే ప్రాంతంలో రజనీకాంత్ ఫిచడియా, 59, వరల్డ్ జ్యూలలర్స్ యజమాని, ఒకే స్థలంలో13,000 బెహెరిన్ దినార్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగలు దోచుకున్నారు. ఈ సంఘటన మార్చి 28 న జరిగింది. ఫిదాడియా ఆభరణాల దుకాణం తలుపు వద్ద తన కుమారుడి కోసం జావాద్ హౌస్ ఎదుట ఎదురు చూస్తుండగా, ఒక -నలుగురు దొంగల ముఠా అతడిపై దాడి చేసి, బంగారు నగలను ఎత్తుకుపోయిన సంఘటన సైతం ఇక్కడ నమోదైంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







