కళ్యాణ్ రామ్ చూపు 'నానీ' వైపు
- July 26, 2017
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే తను హీరోగా నటిస్తున్న సినిమాలకు మాత్రమే నిర్మాణ బాధ్యతలు చేపడుతూ వచ్చిన కళ్యాణ్ బయటి హీరోలతో చేసిన సినిమాలు అంత సక్సెస్ కాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న కళ్యాణ్, ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'జై లవకుశ' ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో నిర్మాతగా సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. ఇదే సమయంలో తన చూపులు నేచురల్ స్టార్ నానీ మీద కూడా పడ్డాయి. సక్సెస్ బాటలో పయనిస్తున్న నానీతో సినిమా చేస్తే తను కూడా నిర్మాతగా సక్సెస్ అవుతానని ఆశిస్తున్నాడు. మరి నానీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హను రాఘవపూడి, మేర్లపాక గాంధీ లాంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ పూర్తయినతరువాత కళ్యాణ్ రామ్ బ్యానర్‌లో చేస్తుండొచ్చు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







